Telangana LRS 2020: 25% తగ్గింపు తో మీ ప్లాట్ రెగ్యులర్ చేసుకోండి (March 31 లోపు చెల్లిస్తే)
తెలంగాణ ప్రభుత్వం Layout Regularisation Scheme (LRS) 2020 లో అప్లై చేసినవారికి 25% తగ్గింపు ఇస్తోంది. ఇప్పటికీ ఫీజులు పెండింగ్‌లో ఉన్నవారు అయితే, 2024 మార్చ్ 31 లోపు చెల్లిస్తే తక్కువ రేటుకి రెగ్యులర్ చేసుకోవచ్చు. మార్చ్ 31 తర్వాత పూర్తిగా మొత్తం ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది, అలాగే ఆమోదం (Approval Process) ఆలస్యం అవుతుంది.
LRS అంటే ఏంటి?
Layout Regularisation Scheme (LRS) అనేది అనధికార ప్లాట్లు, లేఅవుట్లకు ప్రభుత్వం నుండి అధికారిక గుర్తింపు (official approval) తీసుకునే అవకాశం. గత కొన్ని సంవత్సరాలలో అనేక మంది సరైన అనుమతులు లేని ప్లాట్లు కొనుగోలు చేశారు. రెగ్యులర్ చేయించుకోకపోతే భవిష్యత్తులో భవనం నిర్మాణం, రిజిస్ట్రేషన్, అమ్మకం, కరెంట్, నీరు వంటి సౌకర్యాలు పొందడం కూడా ఇబ్బంది గా మారొచ్చు.
LRS వల్ల లాభాలు:
- బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ సులభం అవుతుంది
- బ్యాంక్ లోన్‌కు అప్లై చేయడం సులభం అవుతుంది
- రోడ్లు, నీరు, కరెంట్ లాంటి మౌలిక వసతులకు ఇబ్బందులు ఉండవు
- ప్లాట్ అమ్మకం సులభం అవుతుంది
- రెగ్యులర్ ప్లాట్ కావడం వల్ల ప్లాట్ కు మంచి ధర లభిస్తుంది
- భవిష్యత్ లీగల్ సమస్యలు నివారించవచ్చు
ఇప్పుడే ఎందుకు చెల్లించాలి?
2020 అప్లికేషన్లపై చెల్లింపులు సరిగ్గా పూర్తి కాలేదు కాబట్టి, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా వన్ టైం సెటిల్మెంట్ (One-Time Settlement - OTS) చేసుకునే అవకాశం ఇచ్చింది. 2020 లో అప్లై చేసినవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. దీని ద్వారా మార్చ్ 31, 2025 లోపు చెల్లించిన వారికి 25% తగ్గింపు లభిస్తుంది.
LRS ఫీజులు లక్షల్లో ఉంటాయి కాబట్టి,తగ్గింపు వల్ల భారీగా ఆదా అవుతుంది.
నేను ఇంకా అప్లై చేయలేదు, ఇప్పుడు అవకాశం ఉందా?
ఉంది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అప్లై చేసుకునే అవకాశాన్ని మళ్లీ ఇచ్చింది. కానీ 25% తగ్గింపు 2020 అప్లికేషన్లకే వర్తిస్తుంది. కొత్త అప్లికేషన్లకు పూర్తి ఛార్జీలు ఉంటాయి.
అప్లై చేయాలంటే ఏ డాక్యుమెంట్లు కావాలి?
తెలంగాణ LRS పోర్టల్ లో సుమారు 8 మాడ్యూళ్లు (modules) ఉంటాయి. అందులో మీరు అందాల్సిన వివరాలు:
- ప్రాపర్టీ వివరాలు (Property details): అడ్రస్, ప్లాట్ టైప్, బౌండరీలు
- లింక్ డాక్యుమెంట్స్ వివరాలు
- మార్కెట్ విలువ (Market value) వివరాలు
- స్టాంప్ డ్యూటీ & ఫీజు లెక్కలు
- అమ్మేవారి & కొనేవారి వివరాలు
ఇవి అన్ని పూర్తి చేసి అప్లై చేయాల్సి ఉంటుంది.
ఎక్కడ అప్లై చేయాలి?
- https://lrs.telangana.gov.in
- మీ దగ్గరలో ఉన్న MeeSeva కేంద్రం
- లేదా Landeed ద్వారా ఇంటి నుంచే అప్లై చేయవచ్చు (పక్కనే ఉన్న బటన్ నొక్కండి, మా టీం మిమ్మల్ని సంప్రదిస్తుంది)
2020 లో అప్లై చేసి పెండింగ్ ఉన్నవారు ఎలా చెల్లించాలి?
- వెబ్‌సైట్‌కు వెళ్లండి: https://lrs.telangana.gov.in
- "Existing Application" పై క్లిక్ చేయండి
- Application ID & Mobile Number ఎంటర్ చేయండి
- పెండింగ్ అమౌంట్ చూడండి (25% తగ్గింపు వర్తిస్తుంది)
- UPI, Net Banking, Card ద్వారా చెల్లించండి
- Regularisation Certificate డౌన్లోడ్ చేసుకోండి
చివరిగా
2020లో అప్లై చేసి ఇంకా ఫీజులు చెల్లించని వారు, మార్చ్ 31, 2025 లోపు క్లియర్ చేసుకుంటే 25% తగ్గింపు పొందవచ్చు.
ఇంకా అప్లై చేయని వారు ఇప్పుడే అప్లై చేసుకోవచ్చు.
సహాయం కావాలా? మమ్మల్ని సంప్రదించండి!